కోటప్పకొండకు బయల్దేరిన భారీ విద్యుత్‌ప్రభలు
గుంటూరు,ఫిబ్రవరి16( జనంసాక్షి ): మహాశివరాత్రిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లకు భారీ విద్యుత్ ప్రభలు సోమవారం ఉదయం బయల్దేరాయి. నాదెండ్ల మండలంలోని అవిూన్‌షాహెబ్ పాలెం, అప్పాపురం గ్రామస్థులు 20రోజులు శ్రమించి నిర్మించిన భారీ విద్యుత్ ప్రభలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంభంపోసి దీపారాధన చేశారు. హరోమ్ హరో నినాదాలు చేస్తూ భక్తజనులు ప్రభలను ముందుకు జరిపారు. ప్రత్యేక ఏర్పాట్లతో భారీఎత్తున భక్తులు వెంట తరలిరాగా ప్రభలు కొండకు బయల్దేరాయి.