కోమటిరెడ్డిపై అమరవీరుల కుటుంబాలు ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నిస్తూ లోటస్ పాండ్‌లోని కోమటిరెడ్డి నివాసాన్ని వారు ముట్టడించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఆత్మకు శాంతి చేకూర్చడం ఆదేనా అని ప్రశ్నించారు. కడుపుకోత కలిగిన ఆ బాధ తమకు తెలుసన్నారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం పాటు పడాలని సూచించారు.



