కోమటిరెడ్డిపై అమవీరుల కుటుంబాలు ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో  చేరితే తెలంగాణకు ద్రోహాం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నిస్తూ లోటస్‌పాండ్‌లోని కోమటిరెడ్డి నివాసాన్ని వారు ముట్టడించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఆత్మకు శాంతి చేకూర్చడం ఇదేనా అని ప్రశ్నించారు. కడుపుకోత కలిగిన ఆబాధ తమకు తెలుసన్నారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం పాటు పడాలని సూచించారు.