కోమ్ములు నాటి నిరసన తెలిపిన తెదేపా నాయకులు

కోహెడ : గ్రామపంచాయితీ. పోలిసుస్టేషన్‌కు వెళ్లే రహదార్లు బురదమయం కావడంతో అ ప్రదేశాల్లో పూల కోమ్మలు నాటి తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కె. వెంకటేశం మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలన జిల్లాలో అధ్వాన్నంగా ఉందని ధ్వజమెత్తారు రహదార్లను తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్ష కార్యదర్శులు టి. నాగరాజు,ఎన్‌. శ్రీకాంత్‌, గ్రామశాఖ అధ్యక్షుడు వి.లింగాచారి తదితర నాయకులు పాల్గోన్నారు.