క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్‌

శ్రీకాకుళం, జూన్‌ 12 : బామిని మండలంలోని పెద్ద దిమిలి క్షేత్ర సహాయకుడు ఎస్‌.కిరణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి కల్యాణ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర సహాయకునిపై గ్రామానికి చెందిన వేతనదారులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత మే నెల 18న గ్రామంలో వేతనదారుల సమక్షంలో ఏపీడీ రామారావు విచారణ నిర్వహించారు. ఈ మేరకు వేతనదారులు ఆరోపించిన 11 అంశాలపై విచారించగా అవన్ని రుజువు కావడంతో క్షేత్ర సహాయకునిపై సస్పెన్షన్‌ వేటు విధించారు.