‘ఖని’లో సబ్‌స్టేషన్ల ముట్టడి… – టిఆర్‌ఎస్‌ ఇరువర్గాల నిరసన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి)
విద్యుత్‌ కోతను నిరసిస్తు… సోమవారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో… నాయకులు శారదనగర్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు గుంపుల ఓదేలుయాదవ్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌కోతలు విపరీతంగా ఉన్నాయని… దీంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరెంట్‌కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఏడి ఏపిట్రాన్స్‌కో అధికారికి వినతిపత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పిటి.స్వామి, చల్లగురుగుల మొగిలి, బిక్కినేని నర్సింగరావు, పిల్లి రమేష్‌, దీటి బాలరాజు, బుచ్చిరెడ్డి, మారుతి, నిరంజన్‌, బక్కి కిషన్‌, ప్రకాష్‌, రత్నాకర్‌, సులోచన, విజయలక్ష్మి, ఈదునూరి నర్సింగ్‌, భూషణ్‌హరి, శ్రీనివాస్‌, పాపయ్య, మల్లేష్‌, జగన్మోహన్‌, అనీతాచౌదరి, విజయారెడ్డి, కనుకుంట్ల రమేష్‌, జిమ్మిడి మల్లేష్‌, బత్తుల శ్రీను, రామగిరి రాము తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక రాంనగర్‌ సబ్‌స్టేషన్‌ కూడా… టిఆర్‌ఎస్‌ నాయకులు ముట్టడించారు. ఏఈకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ… విద్యుత్‌ సరఫరాకు కోత విధించడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు గైకొనాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు తోడేటి శంకర్‌గౌడ్‌, పాతపల్లి ఎల్లయ్య, పెంటరాజేష్‌, పర్లపల్లి రవి, అచ్చవేణు, కుమ్మరి శ్రీనివాస్‌, సాగంటి శంకర్‌, ఇందారపు శ్రీనివాస్‌గౌడ్‌, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్‌, పిడుగు కృష్ణ, డాక్టర్‌ రాజేందర్‌, మేకల సదానందం, మేర్గు రాము, నారాయణ, బాబు, సారయ్య, సృజయ్‌, కళావతి, కొమురమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.