ఖమ్మంపల్లి పెద్ద చెరువుకు గండి

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ఖమ్మంపల్లి పెద్దచెరువుకు గండిపడింది. రైతులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఎగువనుంచి భారీగా వస్తున్న వరదతో మరోసారి గండిపడింది. రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.