ఖమ్మం జిల్లాలో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 8, 11 రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వారు తెలియజేశారు.