ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగం: రేణుకాచౌదరి

ఖమ్మం : ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌  రూపొందించి, తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ. 30 కోట్లు  కేటాయించి ప్లాన్‌ అమలు చేస్తామని ఆమె తెలియజేశారు. ఈరోజు ఆమె  ఖమ్మంలో విలేకరులతో మాట్టాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని హుందాగా, గౌరవంగా, గర్వంగా తెచ్చుకుంటామని రేణుక తెలియజేశారు. తెలంగాణ ఎప్పుడివ్వాలి, ఎలా ఇవ్వాలి అనేదాన్ని  కాంగ్రెస్‌ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణపై కేసీఆర్‌ జోష్యం చెబుతున్నారన్న ప్రశ్నకు ఆయన జోష్యంతో తమకు సంబంధంలేదని  అన్నారు.