ఖైరతాబాద్‌- పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నిమ్స్‌ వద్ద ప్రధాన రహదారి పై నిన్న ఏర్పడిన భారీ గుంత వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ట్రిఫిక్‌ను దారి మళ్లించారు. ఖైరతాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను సోమాజీగూడ రాజ్‌భవన్‌ మీదుగా, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలను తాజ్‌ కృష్ణ మీదుగా మళ్లిస్తున్నారు.