గంగూలీ స్టైల్ రిప్లే చూపిస్తాం : భారత ఆర్చరీ బృందం
జలంధర్, జూలై 18: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై 2002లో భారత వన్డే సిరీస్ నెగ్గినపుడు అప్పటి సారథి సౌరవ్ గంగూలీ విన్యాసం అందరికీ గుర్తుండేంటుంది. 324 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి4 సిరీస్ కైవసం చేసుకునన ఆనందంలోనూ, గతంలో ఫ్లింటాప్ చేసిన విన్యాసానికి ప్రతికారంగానూ గంగూలీ తన చొక్కా విప్పిగాల్లో గిరాగిరా తిప్పుతూ హంగామా చేశాడు. భారత క్రికెట్ అభిమానులెవరూ దీనిని మర్చిపోలేరు. అలాంటి సంఘటనను మళ్ళీ రిఫీట్ చేస్తామంటున్నారు. భారత పురుషుల ఆర్చరీ క్రీడాకారులు వీరికి, గంగూలీకి సంబంధం ఏంటనుకుంటున్నారా..ఉందండి..లండన్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ బృందం ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ స్టేడియంలోనే తమ సత్తా ప్రదర్శించనుంది. ఎందుకంటే క్రికెట్ మక్కాగా పేరున్న లార్డ్స్‌లోనే నిర్వాహకులు ఆర్చరీ పోటీలు ఏర్పాటు చేశారు. అప్పటి దాదా సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా పతకం గెలుస్తామని భారత పురుషుల ఆర్చరీ బృందం అంటోంది. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో ప్రత్యేకత కలిగిన లార్డ్స్ స్టేడియంలో పోటీపడుతుండడం చాలా ఆనందంగా ఉందని భారత ఆర్చరీ ప్లేయర్ తరుణ్‌దీప్‌రాయ్ చెప్పాడు. అయితే తాము కచ్చితంగా గంగూలీ స్లైల్ రిప్లే చూపిస్తామని, పతకం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే లండన్ చేరుకున్న భారత ఆర్చర్లు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా ఉన్నారు.