గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హజారే

పుణే: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే గురువారం రాత్రి పుణేలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అవినీతికి పాల్పడే వారికి వివేకం కలగాలని ఈ సందర్భంగా దేవుడిని ప్రార్ధించినట్లు ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆలయంలో ఉన్నప్పుడు అలాంటి విషయాలపై మాట్లాడబోనని బదులిచ్చారు. పుణే గణేశ్‌ మండల్‌ చేపడుతున్న సామాజిక నేవా కార్యక్రమాలను ప్రశంసించారు.