గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపు కోవాలి
–ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్
— టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు
టేకులపల్లి, ఆగస్టు 31(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలకు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్, టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా.. భక్తిశ్రద్ధలతో హిందువులు గణనాథుడిని ఆరాధిస్తారని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు.
గణనాధుని ఆశీస్సులు అందరిపై ఉండాలని,
అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో ఉత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన గణనాధుని మండపంలో వారు పూజలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు దంపతులు, ఎంపీటీసీ జాలాది అప్పారావు దంపతులు, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్ దంపతులు, గుడిపూడి మోహన్ రావు దంపతులు ,గుడిపూడి సత్యనారాయణ దంపతులు ,గుడిపూడి కృష్ణార్జునరావ్ దంపతులు ,గజ్జల రామ్ శేఖర్ దంపతులు, స్థానిక సర్పంచ్ బోడ సరిత, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.