గణపయ్య నవరాత్రులు సందర్భంగా అన్నదానం

 

టేకునుపల్లి, సెప్టెంబర్ 7( జనం సాక్షి ): గణపతి నవరాత్రులు సందర్భంగా టేకులపల్లి, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో బుధవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు సెంటర్లో వినాయక మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ పిఎసిఎస్ బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు లు ప్రారంభించారు. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేయడం పట్ల సీఐ మండపాల ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. టేకులపల్లి లో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం బజారులో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సులానగర్లోని పెద్ద బజారులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని విగ్రహ దాత బానోతు పెద్ద హనుమ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.