గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీస్ సూచనలు

గరిడేపల్లి, ఆగస్టు 27 (జనం సాక్షి): గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో  గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్ఐ కొండల్ రెడ్డి పలు సూచన చేయడం జరిగింది. ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించదాల్చిన వారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు బాధ్యత తీసుకొని గ్రామపంచాయతీ వారి అనుమతి తీసుకోవాలన్నారు. మండపానికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతులు  తప్పనిసరిగా పొందాలని డీజే సౌండ్ లకు అనుమతి లేదని మైకులను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు వారి అనుమతులు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గణేష్ మండపాల ఏర్పాటు చేసే క్రమంలో రోడ్డు బ్లాక్ కావడం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసు వారికి తగు సమాచారం అందించి వారి నుండి అనుమతులు పొందిన తరువాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు విజయవంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్ఐ మండపాల నిర్వాహకులను కోరారు.

తాజావార్తలు