గరిజన తెగ సంక్షేమానికి సినీదంపతుల కోటి విరాళం


చెన్నై,నవంబర్‌2జనంసాక్షి :   తమిళనాడులోని ఇరులర్‌ గిరిజన తెగ సంక్షేమానికి సినీ నటులు సూర్య`జ్యోతిక దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు సిఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి చెక్కు అందించారు. రిటైర్డ్‌ జస్టిస్‌ కె.చంద్రు, పలంకుడి ఇరులర్‌ ట్రస్ట్‌ సభ్యులు ఆ విరాళాన్ని అందుకున్నారు. సూర్య నటించిన జై భీమ్‌ సినిమా సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని 1990లలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గిరిజన తెగకు చెందిన సెంª`గగెని, రాజా కను అనే దంపతులు ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ. న్యాయం చేసే న్యాయవాది పాత్రలో హీరో సూర్య నటించారు.