గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : భాజపా

హైదరాబాద్‌: ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస  వెళ్లి అప్పుల వూబిలో కూరుకుపోతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్తూ దళారుల మోసాలకు ఎంతో మంది బలవుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీదర్‌రావు అన్నారు. దళారుల మోసాలతో వేలాది మంది గల్ఫ్‌ బాధితులు ఇబ్బందులు పడుతున్నా ఒక్క మంత్రి అయినా వారి కష్టాలపై స్పందించడం లేదని మురళీధర్‌ ఆరోపించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ గల్ఫ్‌ బాధితులను ఆదుకునేందుకు  తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.