గవర్నర్‌తో తెదేపా బృందం భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెదేపా బృందం ఈరోజు రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది, మంత్రి ధర్మానపై విచారణకు అనుమతి ఇవ్వరాదన్న మంత్రివర్గ నిర్ణయాన్ని తిరస్కనించాలని తెదేపా బృంద సభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం  అందించారు. ధర్మానను విచారించేలా అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరినట్లు తెదేపా సీనియర్‌ నాయకుడు ఆశోక్‌ గజపతిరాజు విలేకర్లకు తెలియజేశారు. రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యాలు బాధించాయని తెదేపా నాయకులతో గవర్నర్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.