గవర్నర్‌ ప్రసంగం రసాభాస

కాగితాలు చించి ముఖాన విసిరిన సభ్యులు
హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి):
గవర్నర్‌ ప్రసంగంపై అసెంబ్లీలో రాసాభాస జరిగింది. తెలంగాణ నినాదాల మధ్య ఆదరాబాదరాగా సాగింది. బుధవారం ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించగానే టీఆర్‌ఎస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లోంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ చెప్పేవన్నీ అబద్దాలేనని, ప్రజా వ్యతిరేక విధానల వల్లే గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించారు. దొంగల ప్రభుత్వాన్ని గవర్నర్‌ తన ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అయినా గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగ పత్రాలను చించి గవర్నర్‌ ముఖంపై విసిరారు. అనంతరం ప్రసంగాన్ని బహిష్కరిస్తూ బయటకు వచ్చారు. అంతకుముందు టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌ అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.