గాంధీ ఆస్పత్రిలో అరుదైన అవేక్ క్రేనియటోమి శస్త్రచికిత్స
సికింద్రాబాద్ (జనం సాక్షి ): గాంధీ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సను రోగి స్పృహలోనే ఉండగా మెదడులోని కణితిని (ట్యూమర్) న్యూరోసర్జరీ విభాగం అనేస్తేషియా విభాగానికి చెందిన వైద్యులు కలిసి విజయవంతంగా చేశారు..ఈ ఆపరేషన్ సుమారు 2 గంటలపాటు రోగి వైద్యులతో మాట్లాడుతూ సినిమా చూస్తుండగా రోగి మెదడులోని కణతిని సులభంగా తొలిగించరు అని గాంధీ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు . ఈ శస్త్రచికిత్సను న్యూరోసర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో , డాక్టర్ ప్రతాప్ కుమార్ , డాక్టర్ నాగరాజు అనేస్తేషియా విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సారయ్య, డాక్టర్ ప్రతీక్ష, డాక్టర్ అబ్బయ్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు డాక్టర్ కిరణ్ , డాక్టర్ గిరీష్ , డాక్టర్ యామిని , డాక్టర్ స్ఫూర్తి , స్టాఫ్ నుర్సుస్ సిస్టర్ రాయమ్మ , సవిన , రజిని , సుమ వార్డ్ బాయ్స్ నవీన్ వెంకన్న పాలుగోన్నారు