గిరిజనులను ముంచిన వైఎస్‌ను పొగడటమా? : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం అనే అక్బరుద్దీన్‌ ఒవైసీ వైఎస్‌ను పొగడటంపై తెదేపా నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులను ముంచిన వైఎస్‌ను అక్బరుద్దీన్‌ పొగడటమా? అని ప్రశ్నించారు. బయ్యారంలో లక్ష ఎకరాల బాక్సైట్‌ గనులను రాసిచ్చింది వైఎస్‌ అన్న సంగతి తెలియదా? అని అడిగారు.