గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

మన్ననూర్‌: గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర శాసనసభ ఎస్టీ కమిటీ ఛైర్మన్‌ రాజన్నదొర తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలకు సమగ్ర అభివృద్ధి పథకం ద్వారా విద్య, వైద్యం, తాగునీరు, రహదార్ల అభివృద్ధిపనులు చేపట్టడానికి కేంద్రం నిధులు మంజూరు చేసిదన్నారు. నల్లమల అడవిలోని చెంచు గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ త్వరలో పర్యటించనున్నట్టు తెలిపారు. చెంచుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుటుందన్నారు.