గిరిజనుల ఉపాధిని, భూమిని కొల్లగొడుతున్న అక్రమ బాక్సైట్‌ గనుల రద్దు చేయాలి : తెదేపా

హైదరాబాద్‌: విశాఖ మన్యంలో గిరిజనుల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న బాక్సైట్‌ గనుల అనుమతుల్ని ప్రభత్వుం వెంటనే రద్దుచేయాలని తెదేపా డిమాండ్‌ చేసింది. జిందాల్‌, రన్‌ అల్‌ఖైమా, అన్‌రాక్‌ కంపెనీలకు మన్యంలో కేటాయించిన బాక్సైట్‌ గనులను రద్దుచేస్తూ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. గిరిజనుల ఉపాధిని, భూమిని కొల్లగొడుతున్న అక్రమ బాక్సైట్‌ గనుల రద్దుపై సీఎం కూడా తనకేం సంబంధం లేనట్లు వ్వవహరిస్తున్నారని విమర్శించారు.