గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం

టేకులపల్లి, ఫిబ్రవరి 3 (జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల ఖాళీలలో గిరిజన అభ్యర్థులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని,పదోన్నతులలో అడిక్వసి నిబంధనను తొలగించాలని,బదిలీలను వేరువేరు యూనిట్లుగా జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని ఐటీడీఏ కార్యాలయాల ఎదుట శనివారం గిరిజన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టిపిటిఎఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.రాజు,జి.హరిలాల్ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జారీ చేయబడిన 317 జీవో బదిలీలను కూడా ఏజెన్సీ,మైదాన ప్రాంతాల వారీగా పున పరిశీలన చేయాలని,జీవో నెంబర్ 3పై రాజ్యాంగ ధర్మాసనంలో వేయబడిన రివ్యూ పిటిషన్ త్వరగా పరిష్కరించబడేటట్లు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.