గీత కార్మికుడికి గాయాలు

డోర్నకల్‌: మండలంలోని చిల్కోడు గ్రామంలో గురువారం చెట్టుపై నుంచి పడి రాఘం సుధాకర్‌ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సుధాకర్‌ వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని 108లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.