గుండెపోటుతో టీచర్‌ మృతి

మెదక్‌, జూన్‌ 15 : మెదక్‌ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మెదక్‌ వాసవీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బాలకృష్ణ, నందు సంతాపం ప్రకటించారు.