*గుండెపోటుతో బస్సు డ్రైవర్ మృతి*
మునగాల, ఆగష్టు 17(జనంసాక్షి): మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన మొగలిచర్ల ముత్తయ్య (44) మునగాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా కోదాడ వెళ్ళి తిరిగి పాఠశాలకు రాగానే గుండెపోటు వస్తుందని సమీప వ్యక్తులకు తెలయపరచగా 108కు సమాచారం అందించడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు ఆయన మిత్రులలో ఒకరు తెలిపారు. ఆయన మరణంతో ఒక్కసారిగా నరసింహులగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముత్తయ్యకు ఇద్దరు కూతుర్లు, భార్య ఉన్నారు.
