గుజరాత్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో రైతులపై వరాల జల్లు కురిపించింది. తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొంది. మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజ్ వసతులు మెరుగుపరుస్తమని వెల్లడించింది. రాష్ట్రంలో వృద్ధిరేటు సాధించడమే మా ప్రథాన లక్ష్యమని సీఎం నరేంద్రమోడి తెలియజేశారు. వచ్చే ఐదేళ్లలో విద్యుదుత్పత్తిని రెట్టింపు చేస్తమని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంత పేదల కోసం 50 లక్షల పక్కా గృహాలను నిర్మస్తమని స్పష్టం చేశారు. రైట్ టు సర్వీస్ చట్టాన్ని అమలు చేస్తామని హామి ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతామని, ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితిని 2 సంవత్సారాల నుంచి 30కి పెంచుతామని అన్నారు. మహిళలకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని అన్నారు.



