గురుకులాల్లో 2న స్పాట్‌ అడ్మిషన్లు

share on facebook


నిర్మల్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో 2021`22 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం డిగ్రీ తరగతుల్లో చేరడానికి సెప్టెంబరు 2న
స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నామని తెలంగాణ గురుకులాల ఉమ్మడి జిల్లా కోఆర్డీనేటర్‌ వి. గంగాధర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బాలురకు ఆదిలాబాద్‌లో, బాలికలకు ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌లలో డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, ఆదిలాబాద్‌ బాలుర కళాశాలలో బీఏ హెచ్‌ఈపీలలో 13, బీకాం సీఏలో 28, బీజెడ్‌సీలో 20, బీఎస్సీ డాటసైన్స్‌ లో 19, ఎంపీసీఎస్‌లో 35, మొత్తం 115 ఖాళీలు ఉన్నాయన్నారు. ఉట్నూర్‌ బాలికల కళాశాలలో బీజెడ్‌సీ 14, ఎంపీసీఎస్‌ 26, బీకాం సీఏ 27 మొత్తం 67, ఆసిఫాబాద్‌ బాలికలలో బీఎస్సీ, ఎంపీసీలో 20, ఎంపీసీఎస్‌లో 26, బీజెడ్‌సీలో 18, ఎంబీజెడ్‌సీలో 35, బీకాం కంప్యూటర్స్‌లో 16, బీకాం జనరల్‌లో 27, బీఏ హెచ్‌ఈపీలో 14 మొత్తం 156 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆయా కళాశాలల్లో గురువారం నుంచి 31 లోగా దరఖాస్తుతో పాటు ఒర్జినల్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను ఆయా ప్రిన్సిపాల్‌లకు అందించాలన్నారు. మెరిట్‌ జాబితా ఆధారంగా స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Other News

Comments are closed.