గురుకుల కళాశాల దరఖాస్తుల పొడిగింపు

సంగారెడ్డి మున్సిపాలిటీ: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి రెండో నెల 12వ తేది వరకు దరఖాస్తుల చేసుకోవచ్చు అని గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ సదర్శన్‌ పేర్కొన్నారు. 14న బాలురకు హత్నూరలో,బాలికలకు పటాన్‌చెరు మండలం చిట్కూల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. దినిని విద్యార్థులు వినియోగించుకోవాలని తెలియజేశారు.