గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) :
స్థానిక జవహర్‌నగర్‌ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వేణుగోపాల్‌ రావు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు, స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఘనపురం మండలం చెల్పూరు సమీపంలోని దుబ్బపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రావు (25) అనే యువకు డు గత కొద్ది కాలంగా మతిస్థిమితం లేని కారణంగా భూపాలపల్లి పరిసరాల్లో తిరుగుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు, దీని పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎస్‌ఐ వేణు తెలిపారు.