గొంతునులిమి తల్లిని హత్యచేసిన కిరాతకుడు
నిజామాబాద్,అక్టోబర్28 (జనంసాక్షి): జిల్లాలోని చందూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. భూమికోసం కన్నతల్లిని గొంతునులిమి చంపేశాడో ప్రబుద్ధుడు. చందూర్ మండలంలోని లక్ష్మాపూర్‌కు చెందిన సాయమ్మ, నారాయణ తల్లీ కొడుకులు. గత కొంతకాలంగా భూమి విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న సాయమ్మను.. నారాయణ గొంతుపిసికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం
చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.