గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉద్థృతితో భద్రాచలం వద్ద నిటీ మట్టం 35 అడుగులకు చేరింది. మరోవైపు దవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి 5 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.