గ్రామాల్లో ప్రజా చైతన్యం

పల్లెల్లో శ్రమదానాలతో పాటు పారిశుద్య పనులు

మంత్రి పిలుపుతో పలు గ్రామాల్లో మొదలైన కార్యక్రమాలు

సొంత జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): పంచాయితీల్లో పచ్చదనం పారిశుద్యం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలన్న లక్ష్యం మేరకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమం మొదలయ్యింది. మంత్రి జూపల్లి కృష్ణారవు తనసొంత జిల్లాలో దీనిని ప్రాంబించారు. ఇప్పటికే మంత్రి ఆదేశాలతో గ్రామల్లో పారిశుద్య కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పల్లెల్లో పరిశుద్యానికి ప్రాధాన్యం రాబోతుంది. పారిశుధ్యం, పచ్చదనం, తాగునీరు అందరి హక్కుగా ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరబోతుంది. ప్రతీ పల్లె పచ్చగా ఉండేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.ప్రతీ పల్లె పచ్చగా పారిశుధ్య లోపం లేకుండా ఉండాలని అందరికీ కనీస మౌలిక సదుపాయాలు అందాలని ప్రభుత్వ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఇందుకు గానూ అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ చేసారు. దీంతో గ్రామాల్లో శ్రమదానాలు చేపట్టారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీంతో కొత్త పాత పంచాయతీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంత్రి ఆదేశాలు రావడంతో పల్లెల్లో శ్రమదానాలకు యువత ముందుకు వచ్చింది. పలు గ్రామాల్లో అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక నుంచి పచ్చగా ఉండాలని పారిశుధ్యం మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక కృషి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నది. నిత్యం పారిశుధ్యం పనులు చేసే కార్మికులు ఏనాటి నుండో చాలి చాలని జీతాలతో గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న వారి జీవితాల్లో మార్పులు తీసుకు రావడంతో పాటు వారి వేతనాలు పెంచే కార్యక్రమం చేపట్టింది. ప్రతీ పారిశుధ్య కార్మికుడికి కనీస వేతనం రూ.8500 ఉండాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో పారిశుధ్య కార్మికులను ప్రతీ గ్రామపంచాయతీలో ఉండాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కూడా పారిశుధ్యకార్మికులను నియమించుకునే అవకాశలున్నాయి. జిల్లాలో ఇప్పటికే మేజర్‌ గ్రామపంచాయతీల్లో 900మందికి పైగా పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నా రు. వీరు కేవలం మేజర్‌ గ్రామ పంచాయతీలో ఉండగా, తాజాగా నియమించే పారిశుధ్య కార్మికులు ఇక నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండనున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కొత్త కార్యదర్శులను నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు కార్యాచరణ పూర్తి కావస్తుంది. అన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించనున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులే సుప్రీంగా వారికి నిర్ణయాధికారాలు ఇవ్వనున్నారు. ప్రతీ పల్లె చక్కటి వాతావరణంలో ఉండాలని, తాగునీరు, పచ్చదనం, పారిశుధ్యం అందరి హక్కుగా ఉండాలని నిర్ణయించారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులు

మెరుగు పడేందుకు పారిశుధ్య కార్మికులను నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ఇందుకోసం వారి వేతనాలు కనీసం రూ.8500 ఉండాలని నిర్ణయించారు. జీపీల్లో పని చేసే కార్మికుడికి ఈ వేతనం వర్తింప జేయాలని ఆదేశాలు కూడా అధికారులకు అందాయి. వీరితో పాటు కొత్త కార్యదర్శులను నియమించనున్నారు. మొత్తం 479 మంది కార్యదర్శులకు గానూ కేవలం 92 మందే ఉన్నారు. మిగతా సిబ్బందిని త్వరలో నియమించనున్నారు. గ్రామంలో మొక్కలు పెంచేలా గ్రామస్తులను అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అలాగే, గ్రామాల్లో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారికి అధికారాలు కూడా ఇవ్వనున్నారు.