గ్రూప్‌-2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆదిలాబాద్‌, జూలై 19: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 రాత పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21,22 తేదీల్లో ఆదిలాబాద్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు గాను 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 5 వేల 900 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం పరీక్షకు గాను, 22న జరిగే పరీక్షలకు గాను ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ఈ పరీక్షలకు ఏర్పాటు చేసి 23 పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే పోలీసులు ఆదినంలో తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలుగాను అదనపు ఎస్పీ సోమశేఖరరావు పర్యవేక్షణలో డీఎస్పీతోపాటు 10 మంది ఎన్‌స్పెక్టర్లు, 20 మంది ఎస్సైలు, 257 మంది ఇతర సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.