గ్రూప్‌-4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: పూనం మాలకొండయ్య

హైదరాబాద్‌: ఈ నెల 11న నిర్వహించే గ్రూప్‌-4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తియినట్లు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ పరీక్షకు 9,58,333 మంది హాజరవుతున్నట్లు ఆమె తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు 2,629 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక జిల్లా అభ్యర్థి ఇతర జిల్లాల్లో పరీక్ష రాస్తే ఆ వివరాలు పరీక్ష కేంద్రాల్లో నమోదుచేయాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా వివరాలు నమోదు చేయకపోతే నాన్‌ లోకల్‌గా పరిగణించాల్సి వుంటుందని కార్యదర్శి తెలియజేశారు.