ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పిసిసి కార్యదర్శి సురేందర్‌, జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశంలో బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రవేశపెట్టి గ్రామస్థులకు ఆర్థిక రుణ సౌకర్యాలు కల్పించిన ఘనత ఆమెకే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రత్నాకర్‌, నాయకులు రాజేశ్వర్‌, రాజేంద్రకుమార్‌ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.