ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు..
ఊరుకొండ, సెప్టెంబర్ 26 (జనంసాక్షి):
రాచాలపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ పరుశ రాములు, చాకలి ఐలమ్మ వాసులు.. మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, తెలంగాణ తెగులు తెగించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, జంగయ్య,
నిరంజన్, అమరేష్ రెడ్డి, రమేష్ గౌడ్, ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు.