ఘనంగా ప్రారంభమైన పుష్కర పవిత్రోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర పవిత్రోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. వేదశాస్త్ర పురాణ పారాయణాలతో పాటు ద్రవిడ వేద పారాయణ మూల మంత్ర జపములను ఈ పవిత్రోవాల్లో అత్యంత వైభవంగా జరపనున్నారు. ప్రత్యేక శాంతి హోమాలు, లక్ష పుష్పార్చన వంటి ప్రత్యే పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.