ఘనంగా మన్నపుర్ సర్పంచ్ హైదరాబాద్ ఈశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు….

share on facebook

జహీరాబాద్ ఆగస్టు 5 (జనంసాక్షి)
మొగుడంపల్లి మండలంలోని మన్నపుర్ గ్రామ సర్పంచ్ ఘనంగా గ్రామపంచాయతీలో జన్మదిన వేడుకలు జరిపారు.. ఈ సందర్భంగాహైదరాబాద్ ఈశ్వర్ రెడ్డి తన 35వ జన్మదిన శుభ సందర్బంగా తనుపదవిలో ఉన్నంత కాలం ఆడపిల్లల జాననాలను ప్రోత్సహిస్తూ గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టిన ప్రతి ఆడపిల్లకు మేనమామ కానుకగా సొంతంగా 5011 రూపాయలు, మరియు గ్రామం లోని ప్రతి ఆడపిల్ల వివాహానికి ఒక అన్నగా 5011రూపాయలను కానుకగా ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది.దింతో గ్రామం లోని ప్రజలు తమ సర్పంచ్ లో ఒక మేనమామ ను, అన్నను చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు,గ్రామం లోని పెద్దలు,యువకులు తమ యువ సర్పంచ్ సామాజిక స్పృహ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి గ్రామ వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

Other News

Comments are closed.