ఘనంగా మహిళా బందు వారోత్సవాలు

share on facebook
కౌడిపల్లి (జనంసాక్షి). మహిళా బందు వారోత్సవాలలో భాగంగా ఆదివారం రోజున సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మండలంలో మూడు రోజుల పాటు మహిళలకు సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమం ఉద్దేశించి సారా రామ గౌడ్, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు కాలేరు శివ ఆంజనేయులు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, మహిళా మండలి సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, రాఖీ కట్టడం జరిగింది అని, భారతదేశంలో మహిళల కోసం ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కెసిఆర్ చేసి చూపిస్తున్నారని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 10 లక్షల 50 వేల చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, 11 లక్షల కెసిఆర్ కిట్టు పంపిణీ చేయడం జరిగిందని ,గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, శిశువు జన్మించిన తరువాత ఐదు సంవత్సరాల పాటు పౌష్టికాహారం అందజేయడం వంటి అద్భుతమైన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగిందని, ఎమ్మెల్యే మదన్ రెడ్డి  ఆదేశాల మేరకు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జడ్పిటిసి కవిత అమర్ సింగ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఏపిఎం సంగమేశ్వర్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా మండలి మండల సభ్యులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.