ఘనంగా రామచందర్ నాయక్ ఆత్మీయ సన్మాన సభ
మిర్యాలగూడ, జనం సాక్షి.
ఐటీవలే తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఇస్లావత్ రామచందర్ నాయక్ కు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెంలో గల ఎస్ వి గార్డెన్స్ నందు ఈరోజు నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభ అట్టహాసంగా జరిగింది, పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి ఎస్ వి గార్డెన్స్ వరకు బంజారా యువకులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , పాల్గొని రామచందర్ నాయక్ వారి సతీమణి ను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చిట్టిబాబు నాయక్, నాయకులూ ధీరావత్ స్కైల్యాబ్ నాయక్, దామరచర్ల మండల జడ్పీటీసీ అంగోతు లలిత-హతిరం నాయక్, ఎంపీపీ ధీరావత్ రవితేజ నాయక్, కుర్ర సేవ్యా నాయక్, బాలాజీ నాయక్, బంజారా నాయకులూ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.