*ఘనంగా వైస్సార్ 13 వ వర్దంతి ఉత్సవాలు.
చిట్యాల సెప్టెంబర్ 2( జనంసాక్షి) మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాన్ని, సంక్షేమాన్ని ప్రతి గడపకి అందించి పేదోడి బతుకుకు భరోసానిచ్చిన నిస్వార్థ సేవకుడు. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని మరుపురాని-మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోయిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య , చిలుకల రాయకోమురు , దెబ్బట అనిల్ , పర్ల పెళ్లి కుమార్ , బుర్ర కృష్ణ , సృజన్ , జిన్నే నరేష్ , గుమ్మడి సత్యం , మైబెల్లి , శ్రీను తదితరులు పాల్గొన్నారు.