ఘనంగా శ్రీపాద పినాకపాణి జన్మదిన వేడుకలు

కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం తరపున జన్మదిన వేడుకలు చేయడం వ్యక్తిగా తనకు కాదని శాస్త్రీయ సంగీతానికి జరిగిన సన్మానంగా భావిస్తున్నారని వందో వసంతంలోకి అడుగు పెట్టిన పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి అన్నారు. కర్నూలు నగరం నెహ్రూనగర్‌లో పినాకపాణి స్వగృహంలో వందో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విదేశాలతో పాటు, దేశ నలుమూలల స్థిరపడిన పినాకపాణి శిష్యులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, తెలుగు విశ్వవిద్యాలయాలు కలిసి ఈనెల ఏడో తేదిన హైదరాబాద్‌ రవీంద్ర కళాభారతి నిర్వహించనున్న పినాకపాణి వందో జన్మదిన వేడుకుల ఆహ్వాన పత్రికను రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాహరిప్రసాద్‌ అందజేశారు.