ఘనంగా శ్రీ సతీమాత దేవి (సత్తిభవాని) జాతర వేడుకలు
ఘనంగా శ్రీ సతీమాత దేవి (సత్తిభవాని) జాతర వేడుకలు- గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి.- ఆలయ పూజారి భూక్యా తేజ నాయక్
-అమ్మవారికి పుట్టు వెంట్రుకలు సమర్పించిన భక్తులు డోర్నకల్ మార్చి/30/జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాపలతండా గ్రామంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి ప్రక్కన కొలువై ఉన్న శ్రీ సతీమాత దేవి మందిరంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ పూజారి భూక్య తేజ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నావేద్యాలు సమర్పించి డప్పు సప్పట్లతో బంజారా నృత్యాలు చేస్తూ జాతర ఘనంగా నిర్వహించారు.వివిధ గ్రామాలు,మండలాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సతీమాత దేవి నావేద్యాలతో జెండాలు, పుట్టు వెంట్రుకలు సతీదేవి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు.ఈ వేడుకలలో గ్రామ పెద్దలు,భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.