ఘనంగా స్వాతంత్య్ర వన మహోత్సవం
మల్హర్, జనంసాక్షి
మండల కేంద్రమైన తాడిచర్ల తో పాటు మండలంలోని మల్లారం, వల్లెంకుంట, కొయ్యూరు, ఎడ్లపల్లి, దుబ్బపేట, నాచారం తదితర గ్రామాల్లో ఆదివారం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాడిచర్ల లో స్థానిక సర్పంచ్ సుంకరి సత్యనారాయణ తో కలిసి ఎంపీడీవో నర్సింహ మూర్తి మొక్కలు నాటారు. ఆయా గ్రామాల్లో స్థానిక సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో మండల వ్యాప్తంగా మొక్కలు నాటి ఘనంగా వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గోనె పద్మ శ్రీనివాస్ రావు, రమేష్, లింగమూర్తి, స్వరూప, ప్రమీల, కార్యదర్శులు శంకర్, నరేష్, ప్రసాద్, ప్రవీణ్, రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.