చంద్రబాబును కలిసిన ఓయూ విద్యార్థులు
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకులంగా తెదేపా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీని కోసం రాజ్యాంగ సవరణ జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తిి చేశారు.