చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

మహబూబ్‌నగర్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని వాహనం జడ్చర్ల వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి, ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి వాహనం బోత్తాపడినట్లు సమాచారం.