చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకే ఉప ప్రణాళి: ముఖ్యమంత్రి
హైదరాబాద్:ఎస్సీ,ఎస్టీలకు చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకే ఉప ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లుపై సభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానం చేయలేమని, నిబంధనల మేరకే చట్టం, సవరణలు, బడ్డెట్ కేటాయింపులు చేసే అధికారం ఉందని వివరించారు. ఉప ప్రణాళికపై పత్రికల్లో వచ్చే వార్తలకు ఎమ్మెల్యేలు, విపక్షాలు అపోహలకు వెళ్లొద్దని సూచించారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికపై విపక్షాలు 42 సవరణలు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు.



