చిట్టీల పేరుతో మోసం

వరంగల్‌: జిల్లాలోని కాశాబుగ్గలో ఓ వస్త్ర వ్యాపారి చిట్టీల పేరుతో మోసం చేశాడు. రామానుజన్‌ అనే వస్త్ర వ్యాపారి కోటి రూపాయాలతో ఉడాయించాడు. రామానుజన్‌ నివాసం ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఫిర్యాదు చేసినట్లు సమాచారం.